తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న భయానక వాతావరణం గురించి అందరికీ తెలుసు. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాప్ స్టార్స్ అందరూ తమ విరాళాలను ప్రకటించారు. తాజాగా రామ్‌చరణ్ తన వంతు సాయంగా రూ.కోటి రూపాయలను సహాయంగా అందించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున సాయమందిస్తున్నారు.
వర్షాల వల్ల, వరదల వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ అందించాల్సిన సమయం ఇది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.