కొన్నిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంతగానో విలవిలలాడుతున్నాయి. చాలా మంది మంది తినడటానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. కొంత మంది అయితే ఇల్లు కూడా కోల్పోయి ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. ఇదంతా గమనిస్తున్న చాలామంది సినిమా హీరోలు మేమున్నాం అంటూ ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ కోవలోనే (ప్రభాస్)చేసిన సాయం టాక్ అఫ్ ది డే గా ప్రభాస్ భారీ స్థాయిలో నిలిచాడు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఐదు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రభాస్ ప్రకటించాడు.దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అందరి హీరోల కంటే ప్రభాస్ నే ఎక్కువ ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తెలుగు వారంటే ప్రభాస్ కి ఎంత అభిమానమో మరోసారి రుజువయ్యింది. వరదలకు గురైన వసతి సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసాడు. కొన్ని రోజుల క్రితం కేరళలోని వాయనాడ్ లో జరిగిన విపత్తు విషయంలో కూడా రెండు కోట్ల రూపాయాలని ఇవ్వడం జరిగింది.