అలీ(అలీ)బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి సినిమాలోనే పెరిగి సినిమాతోనే పెద్దవాడు అయ్యాడు. తెలుగు తెరపై ఎంతో మంది కామెడీ నటులు తన కంటు కామెడీ లో ఒక బ్రాండ్ ని సృష్టించాడు.హీరోగాను శతదినోత్సవ చిత్రాలలో చేసాడు.అదే విధంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు పొందాడు. ఈ విషయం మరోసారి రుజవయ్యింది.
వరదల వల్ల నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు అలీ తన వంతు సాయంగా ఆరు లక్షల రూపాయలని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాలని ప్రజల పరిస్థితి చూసి నేను నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణాకు 3 లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలను సీయం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తాం అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
ఇక ఈ న్యూస్ ప్రముఖంగా ప్రసారం అవ్వడంతో పవన్ కళ్యాణ్(pawann kalyan)అభిమానులు అలీని ఉద్దేశించి జగన్ ని వదిలి అలీ బయటకి వచ్చాడు కాబట్టి సాయం చేసాడు. లేదంటే జగన్ పర్మిషన్ కోసం వెయిట్ చేసే వాడని, పైగా జగన్ ఇలాంటి ప్రజా విరాళాలకి వ్యతిరేఖం కాబట్టి అలీ విరాళాన్ని ఇచ్చి ఉంటే వాడు కూడా కాదని కామెంట్స్ చేస్తున్నారు. అలీ కొన్ని రోజుల క్రితం వైసిపి ని వీడిన విషయం తెలిసిందే.