కథకుడుగా, దర్శకుడిగా,నటుడిగా, నిర్మాతగా ఇలా విభిన్నమైన పాత్రలని సమర్థవంతంగా నిర్వర్తించి అశేష తెలుగు ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)స్క్రీన్ మీద పోసాని కనపడితే చాలు ప్రేక్షకులు విజిల్స్ తో స్వాగతం పలుకుతారు. కాకపోతే ఇదంతా గతం. ఏ రోజైతే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కి సపోర్ట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించడం స్టార్ట్ చేసాడో అప్పటి నుంచి పోసాని సినీ పతనం శరవేగంగా ముందుకు సాగింది. ఇప్పుడు లేటెస్ట్ గా పోసాని కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో వైసీపీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.అలాంటి వాళ్లలో పోసాని కూడా ఒకడు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ఇల్లు నీటమునిగి ప్రజలు కట్టు బట్టలతో మిగులుతున్నారు.అలాగే కొండ చరియలు విరిగిపడటం వలన కొంత మంది చనిపోయారు. దీంతో వైసిపి కి చెందిన చాలా మంది మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, పవన్ మీద మాటల దాడి చేస్తున్నారు.
పైగా డెబ్భై ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడు పగలనక, రాత్రనక వరద ప్రభావంతో తిరుగుతుంటే చంద్రబాబు ఏం చెయ్యటం లేదని అంటున్నారు. ఇటీవల రోజా మీడియా ముందుకొచ్చి చంద్ర బాబు ని తిట్టడంతో ఆ రోజుల్లో పోసాని కూడా మీడియా ముందుకొచ్చి విమర్శలు చేస్తాడేమో అనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పోసాని ఎక్కడ ఉన్నాడో తెలియదు.