నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా రేపు(సెప్టెంబర్ 6న) ఈ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే తర్వాత తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడు. (నందమూరి మోక్షజ్ఞ)
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనుంది. ఎస్.ఎల్.వి. సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాత అని సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మైథలాజికల్ టచ్ తో రూపొందించబడిన ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తారట.
తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా “లెగసీని ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చింది.. #SIMBAisComing” అంటూ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రెండో సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని రేపు ఉదయం 10:36 కి అనౌన్స్ చేయనున్నారు.