ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘దేవర’ (దేవర) మేనియానే నడుస్తోంది. సినీ ప్రియులంతా దేవర గురించి చర్చించుకుంటున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్‌డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ మాత్రం ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉంది.
‘దేవర’ నుంచి ఇప్పటిదాకా మూడు సాంగ్స్ విడుదలయ్యాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దావుది.. ఇలా విడుదలైన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన థర్డ్ సాంగ్ ‘దావుది’ అనేది వీడియో సాంగ్ కావడం, అందులో ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. థియేటర్ లో ఫుల్ వీడియో సాంగ్ చూడాలని ఎంతగానో ఉన్నారు. అయితే అలా కనిపిస్తున్న ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సాంగ్ సినిమాలో ఉండదట.
దేవర మూవీ అనేది పీరియడ్ యాక్షన్ డ్రామా. అలాంటిది ఇందులో ‘దావుది’ లాంటి రెగ్యులర్ కమర్షియల్ డ్యాన్స్ నెంబర్ ఏంటని కొందరు ముందే ఆశ్చర్యపోయారు. అసలీ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో వస్తుంది?, కథ ఫ్లోని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందా? ఇలా రకరకాల చర్చలు కూడా జరిగాయి. అయితే అసలు సినిమాలో ‘దావుది’ సాంగ్ ఉండదట. జస్ట్ రోలింగ్ టైటిల్స్ లో వస్తుందట.
అయితే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ స్టార్స్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. సరైన మాస్ సాంగ్ పడితే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో డ్యాన్స్ అదరగొడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ‘దావుది’ రూపంలో ‘దేవర’లో అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఉందని.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. కానీ ఇప్పుడు కేవలం రోలింగ్ టైటిల్స్ కి పరిమితమని తెలిసి ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు.