భారీ వర్షాలకు నష్టపోయిన తెలుగు ప్రజలని ఆదుకోవడానికి యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)కోటి రూపాయలు ప్రకటించి తనది ఎంత మంచి మనసో మరోసారి చాటి చెప్పాడు.కెరీర్ విషయానికి వస్తే కుబేర, కూలీ అనే సినిమాలు చేస్తున్నాడు. కుబేర(కుబేర)లో ధనుష్(ధనుష్)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ కూలీ(కూలీ)లో మాత్రం విలన్ గా చేస్తున్నాడు. దీనితో ఆ ప్రాజెక్ట్ మీద అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. ఇక తాజాగా నాగ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నాగ్ మొన్న ఆదివారం నుంచి బుల్లి తెర మీద సందడి చేస్తున్నాడు. అన్ని సీజన్స్ లాగానే బిగ్ బాస్ ఎనిమిద సీజన్ ని కూడా తనదైన స్టైల్ తో రక్తి కట్టించబోతున్నాడు. ఇంతకుముందు జరిగిన ఒక సంఘటనని ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఒక మూవీ షూటింగ్ కారణంగా నాగ్ రెండు వారాల పాటు షోకు దూరంగా ఉన్నాడు. దీంతో ఒక వారం సమంత(samantha)హోస్ట్‌గా వ్యవహరించింది.అప్పుడు నాగ చైతన్య భార్య హోదాలో ఉంది. అక్కినేని వారి కోడలు అనే టాగ్ లైన్ తో ఆ ఎపిసోడ్ ని ఎక్కువ మంది చూసారు. దీంతో టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యాయి. బిగ్‌బాస్ షో చరిత్రలో అప్పటికి ఎప్పుడు రాని విధంగా 11.4 టీఆర్పీతో రికార్డు బద్దలు కొట్టేసింది.
అదే విధంగా బిగ్ బాస్ షోకి మరింత మంది ఆడియన్స్ ని కనక్ట్ చేసి మామగారికి సాయం చేసినా కోడలు అని కూడా అందరితో అనిపించుకుంది. ఇప్పుడు ఈ విషయాన్నేప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. చైతు, సమంత కి 2017 లో వివాహం జరగగా 2021 లో విడిపోయారు. చైతన్య కి ఇటీవలే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్ మెంట్ జరిగింది