నితిన్(nithiin)2002 లో తేజ దర్శకత్వంలో వచ్చిన జయంతో హీరోగా పరిచయమయ్యి తన కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. అభిమాన గణం కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ అభిమానుల ముందుకు బుల్లి నితిన్ వచ్చాడు.
నితిన్ భార్య షాలిని కొంత సేపటి క్రితం పండంటి మగ బిడ్డని ప్రసవించింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపిన నితిన్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని కూడా చెప్పారు. దీంతో అభిమానులు నితిన్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. నితిన్, షాలిని ల వివాహం 2020 లో జరిగింది. నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాతో పాటు రాబిన్ హుడ్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.2020 లో వచ్చిన భీష్మ తర్వాత ఇంతవరకు నితిన్ కి సరైన హిట్ లేదు.