నందమూరి నట సింహం బాలకృష్ణ(balakrishna)వారసుడు యువ సింహం మోక్షజ్ఞ(mokshagna)సిని రంగ ప్రవేశం ఖాయమైన నేపథ్యంలో ఈ రోజు మోక్షజ్ఞ లుక్ రిలీజ్ అయ్యింది. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఆ ఆనందం డబుల్ అయ్యేలా య టైంగ్గర్ ఎన్టీఆర్(ntr) ఒక ట్వీట్ చేసాడు.
సినిమా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నందుకు నా అభినందనలు. తాత గారి అశీసులతో పాటు దైవం యొక్క ఆశయాలు కూడా మీ పై ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే మీ లైఫ్ లో కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యిందని కూడా తెలిపాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ఫుల్ వైరల్ అవుతుంది.