ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య పోటీ తెలుగునాట ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఎంత కిక్ ఇస్తుందో.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య పోటీ అంతే కిక్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం పవన్, మహేష్ ల సినిమాలు తగ్గిపోయాయి. పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. మరోవైపు మహేష్ తన తదుపరి రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా రావడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. ఈ వారసుల గురించి చర్చ మొదలైంది.
పవన్ తనయుడు అకీరా నందన్, మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ ఇద్దరి వయసు సుమారుగా 18-20 ఏళ్ళు. వచ్చే ఐదేళ్ళలో వీరిద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పుడు పవన్, మహేష్ మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా ఉందో.. అకీరా, గౌతమ్ మధ్య పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే లుక్స్ పరంగా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్న అకీరా, గౌతమ్.. హీరోలుగా కూడా పవన్, మహేష్ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాలి. మరి రాబోయే తరంలో అకీరా, గౌతమ్ లలో ఎవరు బిగ్ స్టార్ అవుతారు? ఎవరు టాలీవుడ్ ని ఏలుతారో? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.