సెప్టెంబర్ 27 కి ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఎన్టీఆర్ అభిమానుల్లో,ప్రేక్షకుల్లో దేవర(దేవర)ఫీవర్ ఏ రోజుకా రోజు పెరిగిపోతుంది. చాలా ఏరియాల్లో మిడ్ నైట్ షోలు కూడా పడబోతున్నాయి.వాటికి సంబంధించిన టికెట్స్ కూడా ఇప్పటికే అయిపోయాయనే టాక్ కూడా వినపడుతుంది. తాజాగా దేవర ముంగిట ఒక అరుదైన రికార్డు వచ్చి చేరింది.
ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో దేవర పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తుంది. ఫస్ట్ డే కి సంబంధించి ఓన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రిలీజ్ కి రెండు వారాలు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విడుదల నాటికే దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ల పాయింట్ల గురించి ఆసక్తిని వ్యక్తం చేసింది. .
ఇక ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్,సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అలాగే మూడు సాంగ్స్ కూడా ఒక లెవల్లో ప్రభంజనం సృష్టించడమే కాకుండా రికార్డు వ్యూస్ ని సాధిస్తున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.