ఇటీవలి కాలంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రం వచ్చినంత క్రేజ్ మరే సినిమాకీ రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచాయి. అందరూ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటలకు ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పోస్ట్ చేసిన క్షణం నుంచి స్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టడం మొదలెట్టాయి. క్షణక్షణం లక్షల సంఖ్యలో వీక్షణలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే 35+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘దేవర’ ట్రైలర్ 24 గంటల్లో 40 మిలియన్ వ్యూస్‌ను సునాయాసంగా క్రాస్ చేస్తున్న ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
ఎన్టీఆర్ ఈ సినిమాల్లో రెండు పాత్రల్లో కనిపిస్తారని మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే ట్రైలర్‌లో ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్‌లకు వున్న వేరియేషన్ చూసిన తర్వాత సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. సినిమాలోని యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌తో ఎన్టీఆర్ తలపడే సీన్స్, హీరో ఎలివేషన్స్ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తున్నారు. ట్రైలర్‌తోనే సంచలనం సృష్టిస్తున్న ‘దేవర’ థియేటర్లలో ఎలాంటి రికార్డులు నమోదు అవుతుందో చూడాలి.