తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం వల్ల ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోయారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా ఇప్పటికే 46 మంది మృతి చెందారు. కొన్ని వేల కుటుంబాలు ఆశ్రయాన్ని కోల్పోయాయి. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అందులో భాగంగానే సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ తనవంతు సాయంగా ఆంధ్రప్రదేశ్‌కి రూ.10 లక్షలు. బుధవారం విజయవాడ వెళ్లిన సాయిధరమ్‌తేజ్ వృద్ధాశ్రమాలకు రూ.5 లక్షల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ను కూడా కలిసి బాధితులకు ప్రకటించిన రూ.10 లక్షలను చెక్ రూపంలో అందించారు.