ఎన్టీఆర్(ఎన్టీఆర్)సుమారు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా మొత్తం ఐదు భాషల్లో దేవర(దేవర)గా అడుగుపెట్టబోతున్నాడు. దీన్ని బట్టి ఫ్యాన్స్ ఆకలి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో సగం ఆకలి మాత్రమే తీరగా సెప్టెంబర్ 27తో పూర్తి ఆకలి తీరనుంది.ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో ఫస్ట్ డే టికెట్లు అయిపోయాయి. ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. ఇక రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేకొద్దీ దేవరకి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ బయటకి వస్తూనే ఉంది.ఈ మూవీలోని కొన్ని షాట్స్ కి సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పిన విషయం బయటకి వచ్చింది.
దేవర తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ ఆల్రెడీ పూర్తి అయ్యింది. యు/ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటుగా మూవీ చాలా బాగుందని చెప్పారనే టాక్ కూడా ఉంది. ఇక ఇదే సాయంలో కొన్ని షాట్స్ సెన్సార్ కి అభ్యంతరం చెప్పింది.ఒక వ్యక్తి తన భార్య కడుపు మీద తన్నడం, కుంజర అనే అతని కొడుకు తన తల్లిని కొట్టడం, కత్తికి ఒక శవాన్ని వేలాడదీసే షాట్, సొర చేప విజువల్ లో సిజిఐ మార్క్ వేయలేదని ఇలా నాలుగు షాట్స్ కి అభ్యంతరం చెప్పారు. టోటల్ గా 7 సెకండ్స్ కట్స్ లో 2 సెకండ్స్ రీప్లేస్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక దేవర ప్రమోషన్స్ ఆల్రెడీ ఒక రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ త్వరలోనే వెల్లడి. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేస్తుండగా యంగ్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ జత కట్టగా తండ్రి క్యారక్టర్ తో ఎవరు జత కట్టారనే ఆసక్తి కూడా అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది.దర్శకుడు .కొరటాల శివ(kortala siva)అయితే ఆ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.