కొన్ని రోజుల క్రితం బెంగుళూర్‌లో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. అందులో ప్రముఖ సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పొందుపరిచారు. కానీ హేమ(హేమ)చెపుతున్న మాటలతో ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
హేమతో పాటు మొత్తం ఎనభై ఎనిమిది మంది MDMA డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించిన పోలీసులు అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ని కూడా జతపర్చి కోర్టుకు సమర్పించారు. హేమ ఫ్రెండ్ వాసుతో పాటు చిత్తూరు కు చెందిన డాక్టర్ రణధీర్ బాబు,అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్, నైజీరియన్ పైన పార్టీ నిర్వహకులుగా గుర్తించి 1086 పేజీలతో కూడిన చార్జ్ షీటును పోలీసులు కోర్టుకు సమర్పించారు.
కాకపోతే ఈ కేసులో హేమ వాదన మరోలా ఉంది. పోలీసులు పాత బ్లీఛార్జ్ నే మళ్ళీ తిరగదోడగా, నేను చేయించుకున్న టెస్ట్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్టుగా రాలేదని చెప్తుంది. తన లాయర్ తో మాట్లాడి ముందుకు వెళ్తానని చెప్పుకొస్తుంది. చాలా రోజుల క్రితమే డ్రగ్స్ తీసుకోనట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేసి మరి చెప్పింది. ఈ నేపథ్యంలో ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తీస్తుందో చూడాలి.