జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (దేవర)పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న మూడు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాలుగో పాటకు ముహూర్తం ఖరారైంది. (దేవర పాటలు)
దేవర నుంచి నెక్స్ట్ ‘ఆయుధ పూజ’ సాంగ్ రాబోతుందని, ఇది ఓ రేంజ్ లో ఉంటుందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. “ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా.. ఇప్పుడే మొదలు… ఆయుధపూజ పాట వస్తే మిమ్మల్ని ఇంక పట్టలేం..” అంటూ దేవర ట్రైలర్ విడుదలైనప్పుడు ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసిన రామజోగయ్య శాస్త్రి.. తాజాగా మరో ట్వీట్ చేశారు. “ఆయుధ పూజ ట్రాక్ తో నెక్స్ట్ వీక్ బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్” అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి దేవర అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి “పోతారు” అని రిప్లై రావడం విశేషం.
దేవర సెప్టెంబర్ 27న విడుదల. సినిమా విడుదలకు వారం ముందు అనగా సెప్టెంబర్ 20న ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.