రణబీర్ కపూర్, రష్మిక జతగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ ఎంతగా ఘన విజయం సాధించిందో అందరకీ తెలుసు. ఈ సినిమాతో ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ ఫేమ్ తెచ్చుకున్నభామ త్రిప్తి డిమ్రి(tripti dimri)ఇటీవల బాలీవుడ్ లో బ్యాడ్ న్యూజ్ అనే అడల్ట్ కామెడీ మూవీ చేసింది. జులై 19న రిలీజ్ అవ్వగా మంచి వసూళ్లు సాధించి ఒక మోస్తరు హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలి.
నిజానికి బాడ్ న్యూజ్(bad newz)కొన్ని రోజులు క్రితమే ఓటీటీలో రెంటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెంటల్ కి తీసుకొచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ అడల్ట్ కామెడీ డ్రామా చూసే వారు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.ఇక ఈ చిత్రం ఆనంద్ తివారి దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ బాధ్యతలని అందించాడు. విక్కీ కౌశల్, అమీ విర్క్ లు హీరోలుగా చేసారు.
ఎనభై కోట్ల బడ్జెట్‌తో ప్రదర్శించిన బాడ్ న్యూజ్ ప్రపంచవ్యాప్తంగా నూతన పదిహేను కోట్లకు పైగా వసూలు చేసి 2024లో అత్యధిక వసూళ్లు చేసిన ఏడవ హిందీ చిత్రంగా నిలిచింది.