యంగ్ టైగర్ ఎన్టీఆర్(ఎన్టీఆర్)సెప్టెంబర్ 27న దేవర(దేవర)గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు.రీసెంట్ గా ముంబై వేదికగా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా దేవర మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర కొచ్చే కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని కూడా పెంచింది. ఈ వంటినే యానిమల్ మూవీ తో ఇండియా వైడ్ గా గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి(sandeep reddy)దేవర ని ఇంటర్వ్యూ చేసాడు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఎన్టీఆర్ తో పాటు విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ కొరటాల శివ(kortala siva)ని సందీప్ ఇంటర్వ్యూ చేసాడు.రిలీజ్ కి ప్రేక్షకుల ముందు థ్రిల్ ని ఇవ్వడానికే ఆ ఇంటర్వ్యూ జరిగిందనే ప్రోమో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. సందీప్ అడిగిన మాటలకి దేవర యాక్షన్ డ్రామా అని ఎన్టీఆర్ చెప్పడం,అలాగే ఒక ఫైటింగ్ సీన్ లో సగం మూన్ మీద రక్తం పడి రౌండ్ గా అవ్వడం ఎలా అని కొరటాలని సందీప్ అడిగితే అప్పుడే ఆన్సర్ చెప్పాడని ఎన్టీఆర్ చెప్పటం చాలా క్యూరియాసిటీ ని కలుగజేస్తుంది. అదే విధంగా సందీప్ తో యానిమల్ మూవీ డ్యూరేషన్ మూడుగంటల పదిహేను నిమిషాలా అని ఎన్టీఆర్ అడగగానే మూడుగంటల ఇరవై నాలుగు నిమిషాలు అని సందీప్ చెప్పడం.ఆ తర్వాత ముప్పై ఐదు రోజులు వాటర్ కింద షూటింగ్ చేసాం. అది చాలా టఫ్ అని ఎన్టీఆర్ చెప్పడం ఇలా ప్రోమో ఆసాంతం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ , జాన్వీ, కొరటాల శివ తో కూడా సందీప్ అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీంతో పూర్తి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఉన్నారు. మరో రోజుల్లో పూర్తి ఇంటర్వ్యూ బయటకి రానుంది.