పవన్ కళ్యాణ్(pawan kalyan)రాజకీయాల్లో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా కూడా సినిమాలు చెయ్యడం మాత్రం ఆపకూడదనేది అభిమానుల కోరిక. అందుకే పవన్ లిస్ట్ లో ఉన్న హరిహరవీరమల్లు(hari hara veera mallu)ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి ల కోసం ఫ్యాన్స్ రూపొందించారు. ఆ మూడు మూవీలు కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి.ఆ పై మొన్న జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించిన బిజీ తో పాటు డిప్యూటీ సిఎం, మంత్రిగా పవన్ ఉండటంతో షూట్ కి వెళ్లలేకపోయింది.
కానీ ఇప్పుడు సెప్టెంబర్ 23 నుంచి పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.ఈ మేరకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. దీంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి షూటింగ్ లో పాల్గొనబోతున్న సినిమాగా వీరమల్లు నిలిచిందని చెప్పవచ్చు. నిజానికి కొన్ని రోజుల క్రితమే ఉస్తాద్, ఓజి(ఓగ్)వీరమల్లు నిర్మాతలు పవన్ ని కలిసి తమ సినిమాల గురించి చర్చించుకున్నారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటానని పవన్ ఆ ముగ్గురికి హామీ ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే అందరు ఓజి కి ప్రిఫెరెన్స్ ఇస్తాడని భావించారు. కానీ ఇప్పుడు పవన్ అనూహ్యంగా వీరమల్లు లో పాల్గొనబోతున్నాడు. మిగిలిన రెండు సినిమాల డేట్స్ విషయంలో కూడా త్వరలో ఏమైనా వార్తలు వస్తాయేమో చూడాలి.
ఇక వీరమల్లు పవన్ కెరీర్ లోనే భారీ బడ్జట్ తో రూపొందించబడింది. పైగా పవన్ చేస్తున్న తొలి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కూడా వీరమల్లు నే. నిజానికి ఉస్తాద్, ఓజి ల కంటే ముందే వీరమల్లు ప్రారంభం అయ్యింది. ఇంకా చెప్పాలంటే 2023 లో రిలీజైన బ్రో కంటే ముందే షూటింగ్ ని స్టార్ట్ చేసింది. పవన్ తోనే ఖుషి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాతగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ నే దర్శకుడు.క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ వచ్చిన విషయం తెలిసిందే.ఆల్రెడీ వీరమల్లు టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.