జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘దేవర’ (Devara). సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుత జోరు చూస్తుంటే ‘ఆర్ఆర్’, ‘కల్కి 2898 AD’ సరసన ‘దేవర’ చేరేలా ఉంది. (దేవర బుకింగ్స్)
నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ పరంగా 3 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఈ మూవీ ప్రీమియర్స్ తోనే 3.4 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘కల్కి’ ఈ ఫీట్ ఆధారంగా. ఈ మూవీ ప్రీమియర్స్ తో ఏకంగా 3.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యూఎస్ఏమియర్స్ గ్రాస్ పరంగా ప్రస్తుతం ‘కల్కి’, ‘ఆర్ఆర్ఆర్’ టాప్-2లో ఉన్నాయి. వీటి తర్వాత 3 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే సినిమాగా ‘దేవర’ నిలిచే అవకాశం ఉంది.
ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే దేవర 1.4 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ కి పదిరోజుల సమయముంది. అంతేకాదు ఇంకా షోలు కూడా యాడ్ కావాల్సి ఉంది. ప్రస్తుత ట్రెండ్ ఉంటే ప్రీమియర్స్ తో దేవర 2.5 చూస్తుంటే మిలియన్ డాలర్లు ఖాయమని.. అన్ని కుదిరితే 3 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ‘దేవర’ నిలుస్తుంది.