ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించారు. గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది.
“తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ పనితీరు వేధింపుల ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగింది మరియు దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేదింపుల పరిష్కారానికి సిఫార్సు చేయడం జరిగింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము మరియు వీడియోలను ఉపయోగించవద్దు అని మరియు ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము.” అని ప్రెస్ నోట్ లో సూచిస్తుంది.