టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్‌లో ఒకరు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన తమన్ చేతిలో ప్రస్తుతం ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పలు క్రేజీ సినిమాలు ఉన్నాయి. తాను పని చేసిన స్టార్స్ తో తమన్ మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆ లిస్టులో హీరోయిన్స్ కూడా ఉంటారు. తమన్ కి ఒక స్టార్ హీరోయిన్ ప్రతి ఏడాది గిఫ్ట్ పంపుతుందట. ఈ స్వయంగా తమన్ రివీల్ చేయడం విశేషం.
ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి తమన్ జడ్జిగా నటించాడు. తాజా ఎపిసోడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తావన రాగా.. తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “అనుష్క గోల్డ్. స్వీట్ పర్సన్. నేను చూసిన బెస్ట్ పర్సన్స్‌లో ఒకరు. ఆమె మనసు చాలా మంచిది. నాకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఆమె నుంచి ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ‘భాగమతి’ టైంలో నాకు గాడ్జెట్స్ అంటే ఇష్టమని తెలిసి.. సినిమా హిట్ అయితే గిఫ్ట్‌లు ఇస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం ఐఫోన్ కొత్త వెర్షన్ రిలీజ్ అవ్వగానే నాకు గిఫ్ట్ పంపిస్తారు. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఫోన్ ఆమె పంపించిందే.” అని తమన్ అన్నాడు.
జడ్జిలు గీతామాధురి, కార్తీక్, శ్రీరామ చంద్ర తమన్ కి సరదాగా ఆటపట్టించారు అనుష్క గురించి చెబుతున్న సమయంలో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.