తన 15వ సినిమా ‘గేమ్ ఛేంజర్’ (గేమ్ ఛేంజర్)ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్ (రామ్ చరణ్).. 16వ సినిమా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమా భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ‘RC 16’ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇప్పటిదాకా చరణ్ పాత్రలకు భిన్నంగా, చాలా పవర్ ఫుల్ గా ఇందులో ఆయన పాత్ర ఉంటుందట. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసే పనిలో చరణ్ పడిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో “బీస్ట్ మోడ్ ఆన్.. #RC16 లోడింగ్” అని పోస్ట్ చేసిన చరణ్.. ఓ ఫొటోని కూడా పంచుకున్నాడు. ఆ పిక్ లో చరణ్ ఫిట్ నెస్ కోచ్ కూడా ఉన్నాడు.