విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)రోజు వారి దినచర్య గురించి తెలియని తెలుగు వాడంటూ ఉంటాడు.పైగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు తమకి దొరికిన అదృష్టంగా భావించి ఎన్టీఆర్ దినచర్య గురించి చెప్తారంటే ఎన్టీఆర్ కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష(balakrishna)దిన చర్య కూడా సేమ్ అలాగే అంటుంది.
సినీకి ప్రవేశించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్య ఇటీవల పలు మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో అయన మాట్లాడుతు నాన్నగారి లాగే తెల్లవారుజామునే మూడు గంటలకి నిద్ర లేచి నాన్న కాల్చినట్టే ఒక చుట్టు కాల్చి మిగిలిన పనుల్లోకి వెళ్తానని చెప్పాడు.దీంతో ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్, బాలయ్య లు ఏ కంపెనీ చుట్ట కాలుస్తారు, ఆ చుట్ట రేట్ ఎంత ఉంటుందనే చర్చ జరుగుతుంది.ఎన్ని చర్చలు జరిగినా బాలయ్య దగ్గరనుంచే ఆన్సర్ రావాలి.
ఇక సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్, బాలయ్య ల కాంబోలో తాతమ్మ కల, అనురాగ దేవత, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, సింహం నవ్వింది,భలే తమ్ముడు ,వేముల వాడ భీమ కవి,రౌడీ రాముడు కొంటె కృష్ణుడు,శ్రీ మద్విరాట పర్వం, బ్రహ్మర్షి విశ్వాలమిత్ర, బ్రహ్మర్షి అనుబంధం, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర చరిత్ర లాంటి సినిమాల్లో కలిసి నటించారు.