నివేదా థామస్ (నివేతా థామస్) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’. నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇందులో పదేళ్ల కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ చేయడం కోసం తల్లి పడే తపన హత్తుకుంది. థియేటర్లలో మ్యాజిక్ చేసిన ఈ మూవీ.. త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. (35 చిన్న కథ కాదు)
’35 చిన్న కథ కాదు’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే మూడు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
35 చిన్న కథ కాదు మూవీ రివ్యూ
రానా దగ్గుబాటి సమర్పణలో సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ’35 చిన్న కథ కాదు’లో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, అరుణ్ దేవ్, ప్రియదర్శి, భాగ్యరాజ్, గౌతమి నటించారు. వివేక్ సాగర్ సంగీతంఫర్ అందించిన ఈ చిత్రంటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మ, ఎడిటర్ గా టి.సి. ప్రసన్న వ్యవహరించారు.