నేను నా భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నానని ప్రముఖ హీరో జయం రవి(జయం రవి)ఇటీవల బహిరంగంగానే వెల్లడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్తీ కూడా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. జయం రవి తర్వాత నిర్ణయం నేను నా పిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని స్థితికి వెళ్లిపోయాను, విడాకుల ప్రకనట పూర్తిగా రవి సొంత నిర్ణయం అని చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో అసలు జయం రవి, ఆర్తి విడాకులు తీసుకోవడానికి కేనీషా అనే లేడి సింగర్ కారణమనే వార్తలు తమిళ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. జయం రవి తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపకుండా తరచు గోవాకు వెళ్లేవాడని,అక్కడ ఒక ఖరీదైన బంగ్లా కొనుకోగోలు చేసి కేనీషాతో ఉంటున్నాడని అంటున్నారు. జయం రవి ఒక కారు ఆర్తి పేరు మీద ఉంది. జూన్ 24న, ఆ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆర్తి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది.ఆ తర్వాత ఎంక్వయిరీ చేసిన ఆర్తి కి ఆ కారును కెనీషా నడుపుతున్నట్లు తేలింది. దాంతో గోవా కథ మొత్తం బయటపడిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.
ఇక తాజాగా ఆర్తి, జయం రవి విడాకుల కోసం చెన్నై కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తుంది. 2005లో ప్రేమించుకున్న ఈ ఇద్దరు 2009లో వివాహం చేసుకోగా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇక ఆర్తి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి జయం రవితో కలిసి దిగిన ఫోటోలని కూడా తొలగించారు.