వారి వేధిపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్(jani master)ప్రస్తుతం నెల్లూరులో తల దాచుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై బాధిత లేడీ డాన్సర్ కి అనేక సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ అయినటువంటి అనసూయ(అనసూయ భరద్వాజ్)కూడా తన మద్దతు తెలియచేయడంతో పాటుగా కొన్ని విషయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
బాధిత యువతితో కలిసి పుష్ప(పుష్ప)మూవీకి వర్క్ చేశాను.సెట్స్‌లో రెండు, మూడుసార్లు కూడా తనని చూశాను. తనకి మంచి ట్యాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు ఏమాత్రం తగ్గించలేవు. అలాగే తను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచి పెట్టిందనే విషయం ఇప్పుడు తెలుస్తుంది.ఇలాంటి సంఘటనలని మనసులోనే దాచుకుని పడటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే చెప్పాను. వారికి మద్దతుగా నిలబడతాను. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ పెద్దలందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఇక రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఉన్న ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను.
అదే విధంగా మహిళలందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మనకి ఎవరి సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరే కాదు, మీకు తెలిసిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి. మీకు అందరూ అండగా నిలబడతారనే విషయాన్నీ మర్చిపోకూడదని కూడా చెప్పుకొచ్చింది.