హీరో, హీరోయిన్ మధ్య ఈగో క్లాష్ రావచ్చు. అలాగే హీరో, డైరెక్టర్ మధ్య ఈగో క్లాష్ రావచ్చు. కానీ, హీరో, అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య ఈగో క్లాష్ ఏమిటి? అదే ‘కాంత’ సినిమా. రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఇది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెల్వమణి, సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి నిర్మాతలుగా కూడా రానా, దుల్కర్ సల్మాన్ నటించడం విశేషం. సినిమా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈమధ్యకాలంలో ఈ తరహా సినిమాలు రాలేదు. ‘కాంత’ కూడా ఫిలిం ఇండస్ట్రీ రూపొందుతున్న సినిమాయే. గతంలో వచ్చిన ఈ తరహా సినిమాల్లో చాలా అంశాలు ప్రస్తావించారు.
అయితే ఎవరూ టచ్ చేయని ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందించబడింది. అదేమిటంటే.. ఒక హీరోకి, అసిస్టెంట్ డైరెక్టర్‌కి మధ్య వచ్చిన ఈగో క్లాష్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈగో ప్రధానాంశంగా ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘కాంత’ చిత్రంలో ఈగో క్లాష్ ఎలా వస్తుంది, దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలు చూపించబోతున్నారు. తప్పకుండా ఇది ఒక విభిన్నమైన సినిమాగా రూపొందించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.