నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి మంచి అనుభవం సంపాదించిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నంగా నానితో ‘దసరా’ చేశారు. మొదటి చిత్రంతోనే తన టాలెంట్ ఏమిటో చూపించారు శ్రీకాంత్. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా ‘దసరా’ వచ్చింది. ఫుల్ రన్లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్ అయ్యింది. ఇప్పటివరకు నాని ఎవరూ చూపించని ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో కమర్షియల్ సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సుకుమార్ దగ్గర నేర్చుకున్న ఎన్నో అంశాలు కూడగట్టి ‘దసరా’ ఎంతో వైవిధ్యంగా రూపొందించిన గురువు శ్రీకాంత్.
ఇప్పుడు నానితోనే తన రెండో సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నారు శ్రీకాంత్. నాని 33వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఎనౌన్స్మెంట్ వీడియోను రూపొందించే పనిలో ఉంది. ఈ పట్టిక తన ఎక్స్ ఎకౌంట్ ద్వారా తెలియజేశారు శ్రీకాంత్. ‘2023 మార్చి 7న నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా లాస్ట్ కట్, షాట్ ఓకే చెప్పాను. 2024 సెప్టెంబరు 18న మళ్లీ షూటింగ్లో నా తాజా చిత్రం ‘నానిఓదెల2’ అనౌన్స్మెంట్ వీడియో కోసం యాక్షన్ చెబుతున్నాను. నా మొదటి సినిమా ‘దసరా’ విడుదలై 4 కోట్ల 84 లక్షల 70 వేల 400 సెకన్లు గడిచిపోయాయి. నా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ప్రతి సెకను నా తదుపరి చిత్రం ది బెస్ట్ ఇవ్వడం మీదే దృష్టి పెట్టాను. ‘దసరా’ మించి వంద రెట్లు ‘నానిఓదెల2′ ద్వారా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానని మాట ఇస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రారంభం కావడానికి ముందే తను చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు శ్రీకాంత్. విజయదశమికి ముందే తన కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన తొలి సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా ఆలోచించిన శ్రీకాంత్ రెండో సినిమాకి కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు.