నందమూరి అభిమానులకి ఈ నెల 27న రెండు పండుగలు. ఒక పండుగ యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)దేవర(దేవర)అని తెలుసు.ఇంకో పండుగ ఏముందని అంటారా! ఖచ్చితంగా ఇంకో పండుగ కూడా ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ కూడా యువరత్న నందమూరి బాలకృష్ణ(balakrishna)కూడా 27 న రంగంలోకి దిగబోతున్నాడు.
ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహా లో ప్రసారమయ్యే బాలకృష్ణ వన్ మాన్ షో అన్ స్టాపబుల్(unstoppable)షో కి ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలుస్తుంది. నేను మీకు తెలుసు,నా స్థానం మీ మనసు అని బాలయ్య చెప్పడం ఆలస్యం ప్రజలు తమ పనులు మానుకొని మరి షో ముందు తిష్ట వేస్తారు.ఇప్పటి వరకు మూడు సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా కూడా గుర్తింపు పొందింది.దీనికంతటకీ కారణం బాలయ్య మ్యాజిక్ అనే విషయం అందరికి తెలిసిందే . ఇపుడు ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ కావడానికి ముహూర్తం రెడీ అయ్యింది.ఈ నెల 27 , 28 తారీకుల్లో ఫస్ట్ ఎపిసోడ్ షూట్ జరగబోతుంది.
నిజానికి చాలా రోజుల నుంచి ఫోర్త్ సీజన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే వస్తున్నారు.గెస్ట్స్ విషయంలో కూడా ఈ సారి ఎవరొస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)ఈ సారి గెస్ట్ గా వస్తాడనే వార్తలైతే చాలా బలంగా వినిపిస్తున్నాయి.