జానీ మాస్టర్, సృష్టివర్మ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరిదే హాట్ టాపిక్. తనను ఆరు సంవత్సరాల నుంచి శరవేగంగా వేధిస్తున్నాడంటూ శ్రష్టి ఆరోపిస్తోంది. దానికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనికి రిమాండ్ విధించడంతో జైలుకి పోలీసులు. ఇదిలా ఉంటే.. ఈ కేసు విషయంలో సినీ ప్రముఖులు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇందులో చాలా కోణాలు కనిపిస్తున్నాయి. టాప్ కొరియోగ్రాఫర్‌గా వున్న జానీ మాస్టర్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకే సృష్టి ఈ ఆరోపణలు చేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ వ్యవహారం గురించి జానీ మాస్టర్ భార్య చెబుతున్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
‘జానీ మాస్టర్‌పై ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఆరు సంవత్సరాల క్రితం ఆమెను వేధించాడని చెబుతోంది. దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? అదీ కాకుండా.. ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు ఉంటాయి. జీవితంలో ఎన్నో చూసి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో 16 ఏళ్ల వయసు వారు కూడా ఎంతో మెచ్యురిటీతో ఉంటారు. ఆమె చిన్న పిల్ల కాదు.. జానీ మాస్టర్ అలా ప్రవర్తించి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. ఆ అమ్మాయిది సైకో మెంటాలిటీ. నన్ను వదిన అని పిలుస్తుంది. పక్కకు వెళితే ఆయన్ని బావ అని పిలుస్తూ మరోలా బిహేవ్ చేస్తుంది. దీన్ని ఏమంటారు?
ఆమె ఎలాంటిది కాకపోతే ఇద్దరు పిల్లలు ఉన్న నా భర్తను కోరుకుంటుంది.. దీని గురించి ఆ అమ్మాయితో మాట్లాడాను. ఇది ఎట్రాక్ట్ అయ్యే ఏజ్. కరెక్ట్ కాదు అని చెప్పాను. ఆయన కూడా ఆమెకు ఇదే చెప్పారు. కానీ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటూ బ్లాక్‌మెయిల్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇదంతా ఒక ఫ్యామిలీ హనీ ట్రాప్. నువ్వు ఏదైనా చెయ్యి. బాగా డబ్బు సంపాదించాలి అనేది ఆమె పేరెంట్స్ ఎయిమ్. మమ్మల్ని ఆ అమ్మాయి చాలా డిస్ట్రిబ్ చేసింది. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్ ఎటమ్ట్ కూడా చేశాను. నా దగ్గర ఒకలా మాట్లాడుతుంది, ఆయన దగ్గర ఒకలా మాట్లాడుతుంది. నన్ను వదిన అంటుంది, ఆయన దగ్గరకి వెళ్లి నువ్వులేకపోతే నేను చచ్చిపోతా అంటుంది. ఇదంతా పీక్స్‌కి వెళ్ళిన తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను కొట్టాను. అప్పుడు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అంటుంది. ఇప్పుడేమో ఆరేళ్ళ నుంచి తనను జానీ వేధిస్తున్నాడు అంటుంది. ఏమిటిదంతా. ఆ అమ్మాయి, వాళ్ల అమ్మ ఇద్దరూ సైకోలే. ఇప్పుడు ఎవరైతే ఆమెకు లైఫ్ ఇస్తున్నారో తర్వాత వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందే. అతను ఎంత పెద్ద స్టార్ అయినా ఏదో ఒక విధంగా రచ్చ కీడుస్తుంది’ అంటూ శ్రష్టివర్మ వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయేషా వివరించారు.