విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఇటీవల పొల్లాచ్చిలో పూర్తయింది. ప్రస్తుత హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్. ప్రధాన తారాగణం సినిమాలో పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నటసింహ నందమూరి బాలకృష్ణ సెట్స్‌కి వచ్చారు. గత ఏడాది బాలయ్యతో అనిల్ రావిపూడి చేసిన భగవంత్ కేసరి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనిల్‌తో ఆ సినిమాకి పనిచేసిన అనుబంధంతో తాజా చిత్రం సెట్స్‌కి వచ్చి అనిల్, వెంకటేష్‌లతో ఆప్యాయంగా మాట్లాడారు. వెంకటేష్, బాలయ్య మంచి స్నేహితులు. సెట్‌లో ముగ్గురూ సోదర భావంతో సెట్‌లో సందడి చేయడం అందర్నీ ఆకర్షించింది.
#వెంకీఅనిల్03లో వెంకటేష్ భార్యగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఎక్స్‌లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రైయాంగిల్ క్రైమ్ డ్రామాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిఫిన్‌గా తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎస్.కృష్ణ, జి.ఆదినారాయణ కోరైటర్స్‌గా, వి.వెంకట్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ చిత్రంలో, చిరు బాలరాజ్, ప్రదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.