వెబ్ సిరీస్: ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్
నటీనటులు: అశుతోష్ రాణా, భానుచందర్, సుధ, ప్రియా ఆనంద్, నందు, అక్షర గౌడ, సత్యకృష్ణ, తేజస్వి మదివాడ స్థాపించారు
రచన: ప్రశాంత్ వర్మ, సంజీవ్ రాయ్
ఎడిటింగ్: ఉమర్ హసన్, ఫైజ్ రాయ్
సంగీతం: శక్తి కాంత్ కార్తిక్
సినిమాటోగ్రఫీ: నవీన్ యాదవ్
నిర్మాతలు: రామ్ అచంట, గోపీ అచంట
దర్శకత్వం: అనీష్ యోహాన్ కురువిల్లా
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
విశ్వక్ సేన్ (అషుతోష్ రాణా) ఒక డాక్టర్. పదేళ్లుగా ఆయన జనజీవనానికి దూరంగా ‘నికోబార్’ దీవులలోని ‘మోక్ష ఐలాండ్’లో ఉంటాడు. అక్కడే తనకి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉంటాడు. వయసు మీద పడిన ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్టుగా మీడియాలో హడావిడి మొదలవుతుంది. ఆ సమయంలోనే వివిధ ప్రాంతాలలో ఉన్న కొంతమంది ఇంటికి ఒక లెటర్ వెళుతుంది. అది విశ్వక్ సేన్ పంపిన లెటర్. ఆ లెటర్ ఎవరి పేరు మీదైతే తాను రాస్తున్నానో .. వాళ్లు తన సంతానం .. తన వారసులని ఆయన చెప్తాడు. తండ్రి ప్రేమను వాళ్లకి పంచలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆస్తిపాస్తులను వాళ్లకి పంచాలనుకుంటున్నట్టుగా చెబుతాడు. తన వారసులంతా కలుసుకుని ఒక కుటుంబంగా ఏర్పడితే తనకి అంతకు మించిన సంతోషం లేదని అంటాడు. అలా ఫలానా సమయానికి అంతా ‘మోక్ష ఐలాండ్’ కి చేరుకోవాలని చెబుతాడు. ఇక తమ వారసులంటూ మోక్ష ఐలాండ్ కి ఓ పాతికమంది వరకు వస్తారు. అసలు విశ్వక్ సేన్ పెట్టిన షరతేంటి? ఆ పాతికమందిలో ఎవరు నిజమైన వారసులు? అసలు ఆ ఐలాండ్ లో ఏం జరుగుతుందనేది మిగిలిన కథ. (మోక్ష ద్వీపం యొక్క రహస్యం)
విశ్లేషణ:
సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వెంచర్ కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటుంది. ఈ సిరీస్ అవి రెండింటిని కలికి ఆడియన్స్ కు అందిస్తుంది. అయితే నిడివి విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్త పడాల్సిందనేది సిరీస్ చివర్లో తెలుస్తుంది.
మనిషికి మరణమే లేదంటే ఆ మనిషి ఎంతకైనా తెగిస్తాడు.. ఏదైనా చేస్తాడనేది ఈ సిరీస్‌లో అర్థమవుతుంది. అయితే ఇలాంటి సిరీస్ లు కథలు ఇంగ్లీష్ అండ్ హిందీ బాషల్లో చాలానే వచ్చాయి. కానీ తెలుగులోనే ఒకటి రెండు అలా వచ్చాయి. కానీ ఈ తరహా జానర్ సిరీస్ లు మంచి థ్రిల్ ని పంచుతాయి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 24 నుండి 31 నిమిషాల మధ్యలో ఉంటుంది. అంటే కథేంటో తెలుసుకోవాలంటే దాదాపు నాలుగు గంటల సమయం ఓపికతో చూడాలి. అది పెద్ద మైన్స్ గా మారింది.
మొదటి ఎపిసోడ్ : ది ఇన్విటేషన్ ఇందులో విశ్వక్ సేన్ నుండి అందరికి ఇన్విటేషన్ వస్తుంది. తమ వారసులని మళ్ళీ కలుసుకోవాలని ఉందంటూ చెప్పే మాటలు, వారంతా ఐలాండ్ కి రావడం అంతా కూడా ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇక రెండోది ఐస్ లాండ్ రెక్కీ.. ఇందులో కొన్ని ప్రశ్నలకోసం వాళ్ళంతా ఐలాండ్ లో రెక్కీ పెడతారు. గ్రాండ్ మా టేల్స్.. మొత్తం ఇరవై ఏడు నిమిషాలు ఉంటుంది.. ఇది కాస్త ల్యాగ్ అనిపిస్తుంది కానీ పర్వాలేదు, ల్యాబ్ ర్యాట్స్.. మొత్తం ఇరవై ఏడు నిమిషాలు ఉంటుంది. సైన్స్ అండ్ రీసెర్చ్ వైజ్ సాగుతుంది. నో వన్ ఈజ్ సేఫ్ హియర్ మొత్తంగా ఇరవై రెండు నిమిషాలు ఉంటుంది ఇందులో ఐలాండ్ చుట్టూ ఉన్న నరరూప రాక్షసుల గురించి ఒక్కొక్కరు తెలుసుకుంటారు. సైన్స్ మ్యాటర్స్ ముప్పై ఒక్క నిమిషాలు ఉంటుంది ట్విస్ట్ లు రివీల్ అయ్యే ఎపిసోడ్ ఇది.
ఇక చివరి ఎపిసోడ్ మైండ్ బెండింగ్.. ఇది ఇరవై అయిదు నిమిషాలు ఉంటుంది. అసలెందుకు విశ్వక్ సేన్ అలా చేశాడో తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ చివర్లో ఓ మిస్టరీని వదిలేసి మేకర్స్. అదేంటనేది ఈ సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. సిరీస్ లో మిడిల్ ఎపిసోడ్‌లలోని కొన్ని ఎపిసోడ్‌లలో సాగే సాగదీత, కొన్ని లాజిక్ లెస్ సీన్‌లు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక స్టార్ కాస్ట్ కాస్త ఎక్కువగా ఉంది. దాంతో బలవంతంగా ఆ పాత్రలని ప్రేక్షకుడు భరించాల్సి వచ్చింది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
విశ్వక్ సేన్ గా అశుతోష్ రాణా ఆకట్టుకున్నాడు. విక్రమ్ గా నందు, ఝాన్సీగా ప్రియా ఆనంద్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగిలినవారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
అడ్వెంచర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ని ఇష్టపడే వారికి నచ్చేస్తుంది ఈ ‘ మిస్టరీ మోక్ష ఐలాండ్’.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేశ్