ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘దేవర’ మేనియానే. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడడంతో.. ప్రమోషన్లు మరింత ఊపందుకున్నాయి. ఈరోజు(సెప్టెంబర్ 22) సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అంతేకాదు, ఈవెంట్ స్టార్ట్ కావడానికి కొద్దిగంటల ముందు తాజాగా విడుదల ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. (దేవర రిలీజ్ ట్రైలర్)
“నిన్న రాత్రి ఒక పీడకల వచ్చి ఉంటాది జోగుల.. సంద్రం మళ్ళీ ఏడుపెక్కి నిజంగా ఎర్రసముద్రం అయినట్టు.. అదీ నా చేతుల మీదుగా అయినట్టు కనిపించి ఉంటుంది” అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో ట్రైలర్. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ సీన్స్ తో రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ట్రైలర్ చివరిలో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాన్స్ ఈ రిలీజ్ ట్రైలర్ ను కట్ నచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ రిలీజ్ ట్రైలర్ గతంలో విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ లో చూసేసిన షాట్స్ కూడా ఉన్నాయి. వాటిని రిపీట్ చేయకుండా.. ట్రైలర్ ను పూర్తిగా ఫ్రెష్ గా కట్ చేస్తే బాగుండేది.