మూవీ : ముంజ్య
నటీనటులు: అభయ్ వర్మ, శర్వారీ, సత్యరాజ్, సుహాస్ జోషి, మోనా సింగ్ చేస్తున్నారు.
ఎడిటింగ్: మోనిషా ఆర్. బెల్డవా
సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి
మ్యాజిక్: సచిన్- జిగర్
బిజిఎం: జస్టిన్ వర్గీస్
నిర్మాతలు: దినేష్ విజన్, అమర్ కౌశిక్
దర్శకత్వం: ఆదిత్య సర్పోత్థార్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
పూణెలో బిట్టు(అభయ్ వర్మ) ఉంటాడు. అతడికి రెగ్యులర్ గా ఓ కల వస్తుంది. ఆ కలలో .. ఓ రావి చెట్టు, దానిపై అస్పష్టంగా కనపడే ఓ దెయ్యం.. అది వచ్చినప్పుడల్లా బిట్టు భయపడిపోతాడు. ఇక కొన్ని రోజులకి తన సోదరి వివాహానికి సొంతూరికి వెళ్ళిన బిట్టుకి ఓ నిజం తెలుస్తుంది. వాళ్ళ ఊరిలోని మర్రిచెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసుడి వల్లే తన నాన్న చనిపోయాడని బిట్టుకి తెలిసి ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ మర్రిచెట్టు దగ్గరకి బిట్టు వెళ్తాడు. ఇక బిట్టుని కాపాడటానికి అతని నానమ్మ గీత(సుహాస్ జోషి) వెళ్తుంది. దాంతో ఆ బ్రహ్మరాక్షసుడి చేతిలో ఆమె చనిపోతుంది. ఇక ఆ బ్రహ్మరాక్షసుడు ఆ మర్రిచెట్టుని వదిలి బిట్టుని పట్టుకుంటాడు. ఇక అతడితో పాటు సిటీకి వచ్చిన బ్రహ్మరాక్షసుడు తనకి మున్నీతో పెళ్లి చేయమని ఇబ్బంది పెడతాడు. ఆ బ్రహ్మరాక్షసుడి బారిన పడింది బిట్టు బయటపడ్డాడా? అసలు మున్నీ ఎవరు? బిట్టుకి ముంజ్యకి మధ్యగల సంబంధమేంటో తెలియాలంటే ఈ ముంజ్య (ముంజ్య) చూడాల్సిందే.
విశ్లేషణ:
కథ బాగుంటే అది ఏ భాష అయిన సినిమా లవర్స్ ఇష్టపడతారు. ఈ హిందీ మూవీ కూడా అలాంటి కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉన్న ఈ ముంజ్య(మునియా ) హారర్ అండ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి ఫీస్ట్ అవుతుంది. అందుకే ఈ ముంజ్య అక్కడ భారీ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో బ్రహ్మరాక్షసుడి రోల్ మేజర్ ఇంపాక్ట్ ని ఇస్తుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్, బిజిఎమ్ అదనపు బలాన్ని చేకూర్చాయి. హారర్ అండ్ కామెడీ అండ్ కథనం అన్నీ కూడా చక్కగా కుదిరాయి. అయితే అసలు పాయింట్ కి రావడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇక మొదటి ముప్పై నిమిషాలు కాస్త స్లోగా సాగిన ఎప్పుడైతే వాళ్ళ ఊరికి బిట్టు వెళ్తాడో అక్కడి నుండి కథ ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. చివరి ముప్పై నిమిషాల్లో సాగే డ్రామా ఇంటెన్స్‌గా సాగుతుంది. సినిమాలో సత్యరాజ్ పాత్ర కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ముంజ్య పంచే కామెడీ అందరికి నచ్చేస్తుంది.
అటు కామెడీని ఇటు హారర్ ఎలిమెంట్స్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు. కథలో ఫస్టాఫ్ లో వచ్చే సీన్లు , రెండు పాటలు తీస్తే కథనం సింపుల్ గా అలా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.. అయితే హీరోయిన్ సెకెంధాఫ్ లో వచ్చే పాటలో కాస్త ఎక్స్ పోజింగ్ చేసింది. అది స్కిప్ చేస్తే చూసేయొచ్చు. అశ్లీల పదాలు ఎక్కడ వాడలేదు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సినిమాకి అదనపు బలం. ఇక బిజిఎం, సినిమాటోగ్రఫీ ఒకదానితో ఒకటి పోటీపడ్డాయనే చెప్పాలి. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలవలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
బిట్టుగా అభయ్ వర్మ ఒదిగిపోయాడు. శర్వరీణ సత్యరాజ్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలినవారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: ఈ ముంజ్య(Munjya) కాస్త సాగదీతగా ఉన్నా థ్రిల్ ని పంచేస్తుంది.
రేటింగ్: 3/5
✍️. దాసరి మల్లేశ్