మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)ఇటీవల డాన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో మెగా అభిమానులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది చిరుకి అభినందలు తెలుపుతున్నారు.
రీసెంట్ గా ప్రముఖ రచయిత, నటుడు అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri gopala krishna)మాట్లాడుతు నూటయాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముపై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్ లు వేయడం ఒక అనితర సాధ్యం. చిరంజీవి సాధించిన ఈ రికార్డుతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడి ఉంటుంది. సురేఖ గారు ఆయనకీ దిష్టి తియ్యాలి.గిన్నిస్ రికార్డు సాధించడమంటే ఒక కళ. పైగా డాన్సుల్లో దాన్ని సాధించడమంటే అది చిరంజీవికే సాధ్యమైంది.ఇరవై నాలుగు వేల స్టెప్ లని పెంచుకుంటూనే వెళ్లి మరిన్ని అవార్డులను అందుకోవాలి. అలాగే ఇంద్ర లోని వీణస్టెప్ ని నా జీవితంలో మర్చిపోలేను. ఆ సినిమా చూసే సమయంలో అభిమానుల అరుపులకి థియేటర్ కూలిపోతుందేమోనని భయమేసింది. ఆ వీణ స్టెప్ కోసమే ఒకటి రెండు సార్లు సినిమా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే వీడియోలో చిరు అండ్ పరుచూరి కాంబోలో వచ్చిన ఖైదీ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఖైదీ సినిమా ఘన విజయం నేపథ్యంలో చిరంజీవి డాన్స్ వల్ల హిట్ అయ్యిందా లేక యాక్షన్ సీక్వెన్స్ వల్ల హిట్ అయ్యిందా లేక కథ వల్ల హిట్ అయ్యిందా అని ప్రజలు చర్చించుకునే వాళ్ళు .రచయితలు ఎంత గొప్పగా కథ రాసినప్పటికీ ఒక్కోసారి సినిమా ఆశించినంత విజయం సాధించవచ్చు.రామాయణం లాంటి గొప్ప కథని కొంత మంది హిట్ చేయగలుగుతున్నారు. చూపించిన అందులో రాముడు లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. అలాంటిది కొన్ని సినిమాలు ఆడటం లేదు దీనికి కథ, కదన సౌందర్యం మొదటి కారణం అయితే ఆర్టిస్ట్ నటన రెండో కారణం అని కూడా చెప్పుకొచ్చాడు.