తిరుపతి లడ్డుని కల్తీ చేసిన వారి పేర్లలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంఎల్ రోజా(రోజా)పేరు కూడా వినిపిస్తోంది. ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ అయితే ఒక అడుగు ముందుకేసి లడ్డు కల్తీ చేసి కాజేసిన డబ్బు లో రోజాకి పదిహేను శాతం వాటా కూడా ఉందనే సంచలన ఆరోపణలు చేసాడు.
ఇక రీసెంట్ గా తిరుపతి లడ్డు కల్తీ లో తప్పు ఎవరని రోజా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక పోల్ ని నిర్వహించింది. కల్తీ పాపం జగన్ దే అని డెబ్భై శాతం మందికి పైగా ఓట్లు వేశారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని మరో పోల్ ని కూడా నిర్వహిస్తే చంద్రబాబు పాలన బాగుందని డెబ్భై శాతం మందికి పైగా ఓటు వేశారు.దీంతో నెటిజన్స్ రోజాకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. అదే విధంగా ఆ పోల్ తో రోజా ఒక చరిత్ర కూడా సృష్టించినట్టు అయ్యింది. ఎందుకంటే ఒక గంటలోనే ఎక్కువగా నెటిజన్స్ రిప్లై ఇచ్చిన పోల్ కూడా అదే.
ఈ సర్వే తర్వాత రోజా తన యూ ట్యూబ్ ఛానల్ ని తొలగించింది. లక్షా ముపై వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉండి కూడా రోజా డిలీట్ చేయడం వెనుక రాజకీయ వర్గాల్లో భిన్నకదనాలు వినిపిస్తున్నాయి. రోజా వైసిపి కావడంతో సబ్ స్క్రైబర్స్ లో ఎక్కువ మంది వైసిపి వల్లే ఉంటారని పోల్ లో కూడా ఎక్కువ పర్సంట్ వాళ్లే పాల్గొనే అవకాశం ఉందనే మాటలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.రోజా తన ఛానల్ ని డిలీట్ చేసి వాళ్ల జీవితాల్లో సరికొత్త వెలుగులోకి వచ్చిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.