అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)కి ఇటీవలే ఒకప్పటి మిస్ ఇండియా రన్నరప్, ప్రముఖ సినీ నటి అయినటువంటి శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)తో ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగిన ఈ వేడుకలకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో కూడా నిలిచాయి.దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ కూడా చేసారు.
చైతు తో జరిగిన ఎంగేజ్ మెంట్ పై రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ళ కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.ఆ వేడుకను గ్రాండ్ గా చేసుకోవాలని ముందుగా ప్లాన్ లాంటిదేమీ చేసుకోలేదు. ఇలా జరగాలి అలా జరగాలని కలలు కూడా కనలేదు. జస్ట్ జీవితంలో అతి ముఖ్యమైన మధుర క్షణాలని ఆస్వాదంతో పాటు తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా అలాంటి వేడుకలు జరగాలని కోరుకున్నాను.కాబట్టి ఆ వేడుక నిరాడంబరంగా జరగడానికి వీలు లేదు.నా వరకు పర్ఫెక్ట్ పద్దతిలో ప్రకటించారు.
ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా శోభిత సింప్లిసిటీ స్వభావాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశంచేసిన శోభిత తెలుగులో అడవి శేషు(అడవి శేషు)హీరోగా వచ్చిన గూఢచారి,మేజర్ వంటి చిత్రాల్లో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనపడింది.ప్రస్తుతం హిందీలో తనే టైటిల్ రోల్ లో లవ్ సితార(లవ్ సితార)అనే మూవీ చేయగా,ఈ నెల 27 న జీ 5 లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాలి.