యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)మరికొద్ది గంటల్లో దేవర(దేవర)గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొని ఉంది.ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఈ పాటికే థియేటర్స్ బ్యానర్స్ తో నింపేసి స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూస్తామా అని ఆశగా చూశారు.
ఇక ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే అన్ని చోట్ల షోలు పడబోతున్నాయి. ఇప్పటికే టికెట్లు అన్నీ అయిపోయి థియేటర్లు ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఒక కొత్త దిగులు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండటంతో పాటు భారీ వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.దీంతో ఫ్యాన్స్ చాలా ఏరియాల్లో వరుణ దేవుడ్నిశాంతికి పూజలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.దేవర కి ఏ ఆటంకం కలిగించిందని,చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న రోజు ఈ అర్ధరాత్రి నుంచే వస్తుందని చెప్పి వరుణ దేవుడిని వేడుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా తన మనసులో వరుణ దేవుడ్ని ప్రార్ధించుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు తెరపై వస్తున్న మాస్ సినిమా కావడం, పైగా ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ మూవీ కావడమే అందుకు కారణం. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కూతురు నటిస్తున్న దేవర లో శ్రీదేవి జాన్వీ కపూర్(janhvi kapoor)హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్(saif ali khan)ప్రతి నాయకుడి పాత్రని పోషించాడు. హిట్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కొరటాల శివ(koratala siva)దర్శకుడు.