తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయంలో సరదాగా మాట్లాడినందుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)కి ప్రముఖ తమిళ హీరో కార్తీ(కార్తీ)సారీ చెప్పాడనే విషయం అందరకీ తెలిసిందే.
ఇప్పుడు ఈ విషయం మీద ప్రకాష్ రాజ్(prakash raj)కి చురకలంటిస్తూ ప్రముఖ హీరోయిన్ మాధవిలత(madavi latha)ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ వేరే మతానికి చెందిన వాళ్ళని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి పాటలని వింటున్న వాళ్ళ దగ్గరకి వేరే మతం వాళ్ళు కొంత మంది వచ్చి పాటలు ఆపమని కొడితే ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడాడు. తిరుపతి లడ్డు విషయంలో తను చేసిన పొరపాటుని కార్తీ గ్రహించి సారీ చెప్పాడు.అలా చెప్పుకోవడంలో ఎవరికి ఆనందం రాదు. పైగా మన ధర్మం మీద మనమే కామెంట్స్ చేసుకుంటే ఇంకెవరో కామెంట్స్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే సారీ చెప్పాడు.వేరే వాళ్ళ మనోభావాల విషయంలో ప్రకాష్ రాజ్ సైలెంట్ గా ఉంటాడు. అదే మా మనోభావాల దగ్గరకొచ్చేసరికి ఏదో పాయింట్ అవుట్ అవుతుంది. కాకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే ద్రోహులు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది.