జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (దేవర) భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు నాట ప్రతి థియేటర్ వద్ద పండగ వాతావరణం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఒక్కసారిగా తగలబడిపోవడం హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రత్యక్ష ఆ ఫ్రస్ట్రేషన్ లో నచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కటౌట్ ను తగలబెట్టారంటూ కొన్ని సెకన్ల వీడియో క్లిప్ ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో చాలామంది దీనిని నిజమని నమ్ముతున్నారు. అయితే అసలు దీని వెనక జరిగింది. దేవర చూసిన ఆనందంలో.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానుల కటౌట్ ముందు భారీగా టపాసులు కాల్చారు. ఈ అనుకోకుండా కటౌట్ కి నిప్పు అంటుకొని చూస్తుండగానే ఒక్కసారిగా కాలి పోయింది. అక్కడున్న అభిమానులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. చెక్క కావడంతో క్షణాల్లోనే దగ్దమైంది. ఈ మొత్తం వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అసలు నిజాన్ని బయటపెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.