ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(దేవర)ఈ రోజు మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం వచ్చింది.ఇక స్క్రీన్ పై ఎన్టీఆర్ ప్రత్యక్షమవ్వగానే అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్ మారుమోగించారు.
ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయనే టాక్ వినపడుతుంది.ఆయ సీన్స్ లో ఎన్టీఆర్ కనపరిచిన పెర్ఫార్మెన్స్ లో అయితే అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దేవర, వర అనే రెండు పాత్రల్లో విభిన్నమైన నటన ప్రదర్శించడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడని, మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అనే టాక్ వస్తుంది. ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంతో పాటు షిప్ నుండి సరకు దొంగలించే ఎపిసోడ్ కూడా ఆకట్టుకున్నాయనే మాటలు వినబడుతున్నాయి.
జనతా గ్యారేజ్ తో మ్యాజిక్ చేసిన కొరటాల శివ(koratala siva)ఎన్టీఆర్ కాంబో దేవర తో మరోసారి మ్యాజిక్ చేసిందని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఇక ఫ్యాన్స్ అయితే దేవర రిజల్ట్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉండటంతో పాటు దేవర సాధించే సరికొత్త రికార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే ఫస్ట్ డే కి సంబంధించి 200 కోట్లు దాటిందనే వార్తలు వస్తున్నాయి.