యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)సోలో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దేవర(దేవర)గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీలోని దేవర,వర అనే రెండు విభిన్న క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనే అభిప్రాయం అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుంది. అదే విధంగా రిలీజైన అన్ని చోట్ల కూడా రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసాడు.నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.మీ అపురూపమైన అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. కొరటాల శివ(koratala siva)గారు ఇంత ఆకర్షణీయమైన డ్రామా మరియు భావోద్వేగ అనుభవంతో దేవరను ఊహించినందుకు నాకు ధన్యవాదాలు. నా అనిరుద్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరికొత్త ప్రపంచానికి జీవితం పోశాయి. బలమైన స్తంభాలుగా నిలిచినందుకు నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజుకి మరియు సుధాకర్ మిక్కిలినేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు.కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్, ఎడిటింగ్ ని అందించిన శ్రీకర్ ప్రసాద్ మరియు మూవీకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి కూడా నా కృతజ్ఞతలు అని తెలిపారు.
ఇక ఈ ట్వీట్ లో అభిమానుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.దేవర కోసం మీరు జరుపుకునే వేడుకలను చూడటం నన్ను చాలా ఉప్పొంగేలా చేస్తుంది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. దేవర విషయంలో మీరు సంతోషంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది.మీ అందర్నీ ఎప్పుడు అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఈ ట్వీట్ తో దేవర టాక్ లో ఏ మాత్రం నెగిటివ్ లేదనే విషయం అర్ధమవుతుంది.