యంగ్ టైగర్(ntr)అభిమానులు ఎప్పటినుంచో ఎన్టీఆర్ ఏర్పడిన రోజు రానే వచ్చింది.ఎన్టీఆర్ వన్ మాన్ షో దేవర(దేవర)ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచే అన్ని ఏరియాస్ లో షోస్ పడటంతో ఆయా థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కూడా వచ్చింది.
ఇక మూవీ చూసిన ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అయితే ఎన్టీఆర్ నటనకి ఫిదా అవ్వడంతో పాటు దేవర,వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్తు అని అంటున్నారు. అసలు మూవీ మొత్తానికి ఎన్టీఆర్ నటనే హైలట్ అనే మాటలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మిగిలిన పాత్రల్లో నటినటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసారని కూడా ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు.ఓవర్ సీస్ ప్రేక్షకులు కూడా చాలా సంవత్సరాల తర్వాత మంచి మాస్ సినిమా చూశామనే ఫీల్ తో ఉన్నారని తెలుస్తుంది. టోటల్ గా దేవర పక్కా మాస్ మూవీ అని మాస్ ని ఇష్టపడే ప్రేక్షకులకి పండుగే అనే మాటలు కూడా విన్పిస్తున్నాయి.
మరి ఈ లెక్కన కలెక్షన్స్ పరంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన దేవర రాబోయే రోజుల్లో మరిన్నీరికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. కొరటాల శివ(kortala siva)దర్శకుడు కాగా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్,అజయ్ వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించగా అనిరుద్ సంగీతాన్ని అందించారు.