విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(prakash raj)తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)కి చేసిన ట్వీట్ ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు.
ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేసాడు. మనకేం కావాలి అనే టాగ్ లైన్ ని టైటిల్ గా ఉంచి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమయినా, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సమస్యను పరిష్కరించుకోవడమా అంటూ జస్ట్ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎన్టీఆర్(ఎన్టీఆర్)ఫ్యాన్స్ లో అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లతో భయం పట్టుకుంది.ఇప్పటికే హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ మీద కోపంగా ఉన్నాయి.కొంత మంది అయితే ఏకంగా సినిమా వెళ్లి ఆర్టిసులకి సంబంధించిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరకి ప్రకాష్ రాజ్ ని సినిమాల నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. దేవరలో ప్రకాష్ రాజ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.