తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ పాత్రలోకైనా ఒదిగిపోయి ప్రేక్షకులకి ఆ పాత్ర కలకాలం గుర్తుండిపోయేలా చేయడం మోహన్ బాబు స్పెషాలిటీ. నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలకి కూడా నిర్మించాడు.ప్రస్తుతం తన కుమారుడు విష్ణు(విష్ణు)హీరోగా పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నఆ మూవీలో మోహన్ బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులుగా మిగిలిన విషయం తెలిసిందే. ఈ మేరకు సినీ ప్రముఖులు తమ బాధ్యతగా విరాళాలని అందిస్తూ వస్తున్నారు.ఈ కావాలనే మోహన్ బాబు తన వంతు సాయంగా ఇరవై లక్షల రూపాయలని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు)గారిని కలిసి చెక్కుని అందించాడు.ఆ సమయంలో మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా ఉన్నాడు. మరి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని కూడా కలిసి అమౌంట్ ఇస్తాడేమో చూడాలి.
కొన్నిరోజుల క్రితం తిరుపతి(తిరుపతి)లో ఉన్నమోహన్ బాబు విశ్వ విద్యాలయం మీద చదివే విద్యార్థులు,వాళ్ళ తల్లి తండ్రులపై రకరకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారిని కలిసి మోహన్ బాబు విరాళాన్ని అందించడం ప్రాధాన్యతని సంతరించుకుంది.