ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ సినీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రముఖ పాత, కొత్త నటిమణులే స్వయంగా మీడియా ముందుకొచ్చి వెల్లడి చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. కొంత మంది నటీమణులు అయితే శృంగార వేధింపులు పడలేక చిత్ర పరిశ్రమను వదిలేసి తమిళ సినిమా రంగంలో ఉన్నారు.
ఆ కోవకే చెందిన ప్రముఖ నటి మిను మునీర్(minu munner)ప్రముఖ హీరో జయసూర్య తనని శృంగారంగా వేధించాడని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా మరో సంచలన ఆరోపణ చేసింది. ప్రముఖ దర్శకుడు బాలచంద్ర మీనన్(balachandra menon)సైతం తనని ప్రత్యేకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించాడు. 2007 లో ఒక గదికి పిలిపించుకున్న బాల చంద్ర ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూడాలని ఫోర్స్ చెయ్యడంతో పాటుగా నాకు తోడుగా గదిలోనే ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నేను అక్కడ ఉండకుండా వెంటనే బయటకి వచ్చేసానని చెప్పింది.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో బాలచంద్ర మీనన్ కూడా ఒకరు.1987లో వచ్చిన అచ్చువెట్టంటే మొదలుకొని ముగం అభిముగం,సామంతరంగల్, 18 ఏప్రిల్, 19 ఏప్రిల్,నిన్నయ్ ఎంతిను కొల్లం, ఇలా సుమారుగా నలభై చిత్రాల వరకు దర్శకత్వం వహించాడు. నటుడు గా కూడా చాలా చిత్రాలలో చేసిన బాలచంద్ర గత సంవత్సరం రిలీజైన ఏ రంజిత్ సినిమా, పులిమడ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసాడు.