యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ప్రస్తుతం దేవర(దేవర)తో పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లు కొల్లగొట్టి సిల్వర్ స్క్రీన్ వద్ద తన హవాని కొనసాగిస్తూ వస్తున్నాడు.దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేకుండాపోతున్నాయి.
రీసెంట్ గా దేవర పై కుర్చీ తాత(kurchi thata)కొన్ని కామెంట్స్ చేసాడు. దేవరలో ఎన్టీఆర్ చాలా కష్టపడి చేసాడు.కలెక్షన్స్ కూడా మస్తు వస్తున్నాయి.జనం టాక్ ప్రకారం యాభై శాతం సినిమా బాగుంది.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి కంటే బాగా చేసింది కాకపోతే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ పార్ట్ అని చెప్పడమే కాకుండా బాహుబలి మొదటి పార్ట్ లో ప్రభాస్ ని కట్టప్ప పొడిచినట్టుగా దేవర లో కూడా అదే సీన్ పెట్టడం తప్పని చెప్పుకొచ్చాడు.ఇందుకు దర్శకుడు కొరటాల శివదే బాధ్యతని కూడా తెలిపాడు.