తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(రజినీకాంత్)సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరడంతో ఆయన అభిమానులతో పాటు ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. దీంతో రజనీ హెల్త్ న్యూస్ ఇప్పుడు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారడంతో పాటు రజనీకి ఏమైందని ఆరా తీస్తున్నారు.
డెబ్భై మూడు సంవత్సరాల రజనీకాంత్, గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ మంగళవారం నాడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన సాయి సతీష్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. కూడా అంటున్నారు. అయితే, రజనీ ఆసుపత్రిలో చేరడంపై అటు కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
రజనీ ఇటీవలే వెట్టయాన్(వెట్టయన్)మూవీని కంప్లైంట్ చేసాడు.ఈ నెల వరల్డ్ వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండగా సూర్య తో జై భీం ప్రదర్శించి నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన టి జె జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో వెట్టయాన్ పై అందరిలోనూ భారీ అంచనాలు.రీసెంట్ గా ఆడియో లంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది.ఇక లోకేష్ కనగరాజ్ తో కూడా కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యింది.