సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞాన వేల్ దర్శక’త్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
“ఖైదు చెయ్ ఖైదు చెయ్… నేరస్తుడిని ఖైదు చెయ్” అంటూ మొదలవుతుంది వేట్టయన్ ట్రైలర్. “ఈ దేశంలో ఆడ’పిల్లలకు భద్ర’త లేదు. కానీ, పోరంబోకుల’కు బాగా భద్ర’త ఉంది. ఇలాంటి మ’గ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి” అని ట్రైలర్‌లో వినిపించే డైలాగులతో అక్కడ జరిగిన విషయమేంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే.
“నేరస్తుడిని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి….
ఇట్ వాజ్ ఎ బ్రూటల్ మర్డర్ సార్…
ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏదీ ఐసోలెట్ చేసి చెప్పలేక పోతున్నాం సార్…
మీరు లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్లిపోండయ్యా..”
ఈ డైలాగులన్నీపోలీస్ డిపార్టుమెంట్‌లో రకరకాల సందర్భాలను కళ్లకు కడతాయి.
“వారంలో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలి” అని రావు రమేష్ అనే మాటకు… “అక్కర్లేదు సార్. వారం రోజులు అక్కర్లేదు. మూడే రోజుల్లో డిపార్ట్ మెంట్‌కి మంచి పేరొస్తుంది” అని సమాధానం చెబుతూ ఎంట్రీ ఇస్తారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన స్టైలిష్ నడక, హుందాతనం చూస్తే, వేట్టయన్ – ద హంటర్ అనే పేరుకు పర్‌ఫెక్ట్ గా సరిపోయిన కటౌట్ అనిపిస్తుంది. జైలర్ తర్వాత ఓ పక్కా యాక్షన్ సినిమాలో భలేగా ఫిట్ అయ్యారు తలైవర్.
జస్టిస్ డినైడ్ అంటూ… కారులో వెళ్తూ కనిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు అంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చే యాంగ్రీ యంగ్ మ్యాన్ రానా. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూలేం లేదు. కొంచెం బుర్రుంటే చాలు.. అంటూ వైవిధ్యమైన కేరక్టర్‌తో పరిచయమయ్యారు ఫాహద్ ఫాజిల్.
2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి బ్లాక్‌బస్టార్ చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కళైకలో రాబోతున్న సినిమా వేట్టయన్ ద హంటర్. అలాగే పేట, దర్‌బార్, జైలర్ చిత్రాలకు పుట్ ట్యాపింగ్ ట్యూన్స్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్… రజనీకి నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావడంతో ‘వేట్టయన్- ద హంటర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన ‘వేట్టయన్- ద హంట’ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్.